: కేరళలో బర్డ్ ఫ్లూ... 1.5 లక్షల కోళ్ల వధకు నిర్ణయం
కేరళలో బర్డ్ ఫ్లూ కేసులు అధికం కావడంతో 1.5 లక్షల కోళ్ళు, ఇతర పక్షులను వధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హెచ్5 ఏవియన్ ఇన్ ఫ్లూఎంజా వైరస్ (బర్డ్ ఫ్లూ వైరస్) బయటపడ్డ అలపుళ, కొట్టాయం, పతనంతిట్ట జిల్లాల్లో బర్డ్ ఫ్లూ నివారణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఊమెన్ చాంది నేతృత్వంలో సమావేశమైన ఉన్నతస్థాయి కమిటీ ఆదేశాలు జారీ చేసింది.