: తమరు జైలుకెందుకెళ్లారో చెప్పండి?: జగన్ కు బొజ్జల ప్రశ్న


వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైలుకు ఎందుకెళ్లారో ప్రజలకు తెలియాల్సిన అవసరముందని మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి అన్నారు. ప్రధాని మోదీ గాలితోనే చంద్రబాబు గెలిచారన్న జగన్ వ్యాఖ్యలపై స్పందించిన బొజ్జల ఘాటుగానే సమాధానమిచ్చారు. ఎన్నికల్లో ఎవరు, ఎవరి గాలితో గెలిచారన్న విషయాన్ని పక్కనబెడితే, అసలు తాను జైలుకెందుకెళ్లారో జగన్ ప్రజలకు వివరించాల్సిన అవసరముందని బొజ్జల వ్యాఖ్యానించారు. జగన్ అవినీతి కారణంగా ఎందరో అధికారులు జైలుకెళ్లాల్సి వచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News