: ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఫిల్ హ్యూజెస్ పరిస్థితి విషమం
ఆస్ట్రేలియా యువ బ్యాట్స్ మెన్ ఫిల్ హ్యూజెస్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు నిర్ధారించారు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో న్యూ సౌత్ వేల్స్ - సౌత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ సందర్భంగా ఫిల్ తీవ్రంగా గాయపడ్డాడు. షాన్ అబాట్ విసిరిన బౌన్సర్ ను తప్పుగా అంచనా వేసిన ఫిల్... హుక్ షాట్ ఆడడానికి ప్రయత్నించాడు. ఈ సందర్భంగా అతని తల పక్క భాగాన్ని బంతి బలంగా తాకింది. దీంతో పిచ్ మీద ఫిల్ హ్యూజెస్ కుప్పకూలిపోయాడు. వెంటనే ఫిల్ ను మూడు అంబులెన్సులు, ఒక హెలికాప్టర్ సహాయంతో ఆసుపత్రికి తరలించారు. ఫిల్ ను పరీక్షించిన వైద్యులు అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఫిల్ కు అత్యవసర చికిత్స కొనసాగుతోంది. ఇండియాతో జరగనున్న టెస్ట్ సిరీస్ లో గాయపడ్డ మైఖేల్ క్లార్క్ స్థానంలో ఫిల్ కు పిలుపు వస్తుందని అందరూ భావిస్తున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంచి ఫామ్ లో ఉన్న ఫిల్ హ్యూజెస్ షెఫీల్డ్ మ్యాచ్ లో కూడా 63 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు.