: మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు: దాసరి


సినీ పరిశ్రమలో తరాలు మారుతున్నా... సినిమాకి, ప్రేక్షకుడికి ఉన్న అనుబంధం మాత్రం శాశ్వతంగానే ఉందని దర్శక నిర్మాత దాసరి నారాయణరావు అన్నారు. హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం ఈ నెల 30న 'మేము సైతం' అనే కార్యక్రమాన్ని చిత్ర పరిశ్రమ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి హైదరాబాదులో నిన్న పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ, "రాష్ట్రంలో ఏ విపత్తు సంభవించినా చిత్ర పరిశ్రమ తన వంతు సాయం చేసింది. ఇప్పుడు హుదూద్ బాధితులను ఆదుకోవడానికి మరోసారి పరిశ్రమ ముందుకొచ్చింది. ఇంతకు ముందు జరిగిన ప్రెస్ మీట్ కు దాసరి రాలేదని... ఈ రోజు సమావేశానికి వేరే వాళ్లు రాలేదని... పరిశ్రమలో విభేదాల వల్లే ఇలా జరుగుతోందని కొందరు అంటున్నారు. వాస్తవానికి, చిత్ర పరిశ్రమలో ఎలాంటి విభేదాలు లేవు. ఎవరి వీలును బట్టి వారు హాజరవుతుంటారు. అంతే" అని తెలిపారు. నటుడు మోహన్ బాబు మాట్లాడుతూ, తాము ఈ స్థాయికి చేరడానికి కారణమైన ప్రజలకు సాయం చేయడానికి, మేమున్నామంటూ అందరం ముందుకొచ్చామని చెప్పారు.

  • Loading...

More Telugu News