: నేడు కాశ్మీర్, జార్ఖండ్ లలో తొలి దశ ఎన్నికలు


జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల్లో మరి కొద్దిసేపట్లో తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. తొలి దశలో భాగంగా కాశ్మీర్ లో 15, జార్ఖండ్ లో 13 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండు రాష్ట్రాల్లో పోలింగ్ కు సంబంధించి ఎన్నికల కమిషన్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులతో పాటు తీవ్రవాద సంస్థలు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కాశ్మీర్ లో చతుర్ముఖ పోటీ నెలకొనగా, జార్ఖండ్ లో ద్విముఖ పోరులో అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా, బీజేపీలు తలపడుతున్నాయి.

  • Loading...

More Telugu News