: నేడు ఉత్తరాంధ్రలో కేంద్ర బృందం పర్యటన


హుదూద్ తుపాను నష్టాన్ని అంచనా వేసేందుకు ఎట్టకేలకు నేడు కేంద్ర బృందం ఏపీకి రానుంది. గత నెలలో విరుచుకుపడిన హుదూద్ తుపాను నేపథ్యంలో విశాఖ జిల్లాతో పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. విశాఖ నగరంలో గతంలో ఎన్నడూ లేనంతగా నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి బాసటగా నిలుస్తామని ప్రధాని నరేంద్ర మోదీ నాడే ప్రకటించారు. అయితే నష్టాన్ని అంచనా వేసేందుకు నేటి దాకా కేంద్ర బృందమే రాష్ట్రంలో అడుగు పెట్టలేదు. సుదీర్ఘ విరామం తర్వాత నేడు రాష్ట్రానికి రానున్న కేంద్ర బృందం విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటించి తుపాను నష్టాన్ని అంచనా వేయనుంది.

  • Loading...

More Telugu News