: నాకు ఏ హోదా కింద భద్రత కల్పిస్తున్నారు?: జశోదాబెన్


తనకు ఏ హోదా కింద భద్రత కల్పిస్తున్నారో చెప్పాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ భార్య జశోదాబెన్ సమాచార హక్కు చట్టం కింద కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. భద్రతతో పాటు ప్రధాని భార్యకు ప్రోటోకాల్ ప్రకారం ఇంకా ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తారని ఆమె దరఖాస్తులో ప్రశ్నించారు. తాను ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణిస్తుండగా, తన భద్రతా సిబ్బంది అధికార వాహనాల్లో ప్రయాణిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ బాడీగార్డుల చేతిలోనే హత్యకు గురైయ్యారని గుర్తు చేసిన ఆమె, తన చుట్టూ ఉన్న భద్రతా సిబ్బంది కారణంగా తాను ఆందోళన చెందుతున్నానని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తనకు కేటాయించిన భద్రతా సిబ్బంది వివరాలు తెలపాలని ఆమె కేంద్రాన్ని కోరారు.

  • Loading...

More Telugu News