: చంద్రబాబుకు లేనిది, మనకు ఉన్నది అదే: జగన్
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. పార్టీ సమీక్ష సమావేశాల్లో భాగంగా ఆయన ఒంగోలులో శ్రేణులతో మాట్లాడారు. చంద్రబాబుకు లేనిది, తమకు ఉన్నది.... దేవుడి దయ అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. బాబులా అడ్డగోలు మాటలు చెప్పి ఉంటే వైఎస్సార్సీపీ అధికారం చేజిక్కించుకుని ఉండేదని అన్నారు. సీఎం పీఠం కోసం చంద్రబాబు ఎన్నో అబద్ధాలు చెప్పారని జగన్ తెలిపారు. అయినా, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి, వైఎస్సార్సీపీకి మధ్య ఓట్ల తేడా ఐదు లక్షలేనని అన్నారు.