: ప్రియాంక చోప్రాకు మోదీ ప్రశంసలు
ప్రధాని నరేంద్ర మోదీ బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా (పీసీ)ను ప్రశంసించారు. స్వచ్ఛ భారత్ అభియాన్ లో ఆమె పాల్గొనడంపై అభినందించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. గాంధీ జయంతి నాడు ప్రారంభమైన ఈ క్లీన్ ఇండియా డ్రైవ్ లో తొలుత, పలు రంగాల్లో పేరు తెచ్చుకున్న ఎనిమిది మందిని మోదీ నామినేట్ చేశారు. వారిలో 'పీసీ' కూడా ఉంది. మోదీ ట్వీట్ చేయడానికి కొన్ని గంటల ముందు పీసీ తన 'స్వచ్ఛ భారత్' తాలూకు వీడియోను ట్విట్టర్లో పెట్టింది.