: డీఎల్ఎఫ్ కేటాయింపులన్నీ కేసీఆర్ వచ్చాకే జరిగాయి: రేవంత్ రెడ్డి


డీఎల్ఎఫ్ భూ కేటాయింపులన్నీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే జరిగాయని టి.టీడీపీ నేత రేవంత్ రెడ్డి అన్నారు. కానీ, సీఎం సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. అసలు డీఎల్ఎఫ్ గురించి ప్రజల్లోకి తీసుకెళ్లింది తానేనని, ఆ ఆరోపణలు నిజమని తేలాయని అన్నారు. అయినా ఆరోపణలు చేసిన తనకు సభలో చర్చకు అవకాశం ఇవ్వలేదన్నారు. వాస్తవాలు బయటికి వస్తాయనే టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారని తెలిపారు. భూ కేటాయింపు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.250 కోట్లకు పైగా నష్టం జరిగిందని వివరించారు. అంతకుముందు సభలో భూకేటాయింపుల చర్చ సందర్భంగా రేవంత్ మాట్లాడటం ప్రారంభించగానే అధికారపక్ష సభ్యులు గందరగోళం సృష్టించారు. దాంతో, ఈ అంశంపై చర్చను ముగిస్తున్నానని ప్రకటించిన స్పీకర్, సమావేశాన్ని అరగంట పాటు వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News