: టీడీపీ కంటే 5 లక్షల ఓట్లతో వెనుకబడ్డాం: జగన్


టీడీపీకి, తమకు కేవలం 5 లక్షల ఓట్ల తేడా మాత్రమే ఉందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గడచిన ఎన్నికల్లో తాము 5 లక్షల ఓట్ల తేడాతోనే ఓటమి చెందామని కూడా ఆయన వెల్లడించారు. సోమవారం ప్రకాశం జిల్లాకేంద్రం ఒంగోలుకు వచ్చిన ఆయన జిల్లాలో పార్టీ పరిస్థితిని సమీక్షించారు. ముఖ్యమంత్రి పదవి దక్కించుకునేందుకు చంద్రబాబునాయుడు పలు అబద్ధాలు చెప్పారని ఆయన ఆరోపించారు. చంద్రబాబులా తాము కూడా అబద్ధాలు చెప్పి ఉంటే, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి ఉండేదన్నారు. చంద్రబాబుకు లేనిది, మనకున్నది దేవుడి దయ మాత్రమేనని ఆయన తన పార్టీ నేతలు, కార్యకర్తలకు చెప్పారు.

  • Loading...

More Telugu News