: ఏ చికిత్సకు ఎంత ఖర్చవుతుందో బోర్డు పెడతారు!
అలహాబాదులోని ప్రైవేట్ ఆసుపత్రులకు ఉత్తరప్రదేశ్ ఆరోగ్య శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వ్యాధి నిర్ధారణ, చికిత్సకు సంబంధించిన రేట్ల వివరాలను తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఆ ఆదేశాల్లో పేర్కొంది. అధిక బిల్లులు వేస్తున్నారంటూ రోగుల బంధువులు ఆసుపత్రులపై దాడులు చేస్తున్న ఘటనలు ఎక్కువవుతుండడంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స విషయమై పారదర్శకత కోసం చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ బీకే సింగ్ అధికారులకు సూచించారు. ఇప్పటికే అలహాబాద్ జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులకు లేఖ రాశామని జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ పద్మాకర్ సింగ్ తెలిపారు.