: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత చర్యలు తీసుకోండి: టి.టీడీపీ
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారిని టి.టీడీపీ కోరింది. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆయన కార్యాలయంలో కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై లిఖిత పూర్వకంగా సాయంత్రం స్పీకర్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఇటీవల పలువురు టీడీపీ శాసనసభ్యులు టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే.