: ట్విట్టర్ ఫాలోయర్లకు ఆడియో సందేశాలు పంపిన షారుఖ్


బాలీవుడ్ బాద్షా ట్విట్టర్ ఫాలోయర్ల సంఖ్య పది లక్షలు దాటిన సంగతి తెలిసిందే. తన అకౌంట్ ను అనుసరిస్తున్నందుకు గాను అభిమానులకు షారుఖ్ కృతజ్ఞతలు తెలిపాడు. ఈ మేరకు వారికి ఆడియో సందేశం పంపాడు. ఆడియో కార్డ్ సౌకర్యం ద్వారా పంపిన ఈ సందేశంలో "హాయ్ ఎవ్రిబడీ, నేను షారుఖ్ ఖాన్ ని. నన్ను నేను ఎందుకు పరిచయం చేసుకోవాల్సి వచ్చిందంటే... మీలో కొందరు నా గొంతును సినిమాలు, టీవీ షోలు, రేడియోల్లో విని ఉంటారు. అయితే, ట్విట్టర్లో నేను మాట్లాడడం ఇదే తొలిసారి. నాపై ప్రేమ చూపుతున్నందుకు మిమ్మల్ని ప్రేమిస్తున్నాను" అని పేర్కొన్నాడు. ట్విట్టర్లో ఫాలోయింగ్ పరంగా భారత్ లో ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత షారుఖ్ రెండో స్థానంలో ఉన్నాడు.

  • Loading...

More Telugu News