: హిల్లరీ క్లింటన్ గొప్ప అధ్యక్షురాలు కాగలరు: ఒబామా


అమెరికా మాజీ విదేశాంగ శాఖ మంత్రిగా హిల్లరీ క్లింటన్ ఆ దేశానికి గొప్ప అధ్యక్షురాలు కాగలరని అధ్యక్షుడు బరాక్ ఒబామా అభిప్రాయపడ్డారు. 2016 దేశ ఎన్నికల్లో బలీయమైన డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ ఇస్తారన్నారు. ఈ మేరకు ఏబీసీ న్యూస్ ఇంటర్వ్యూలో ఒబామా మాట్లాడుతూ పైవిధంగా పేర్కొన్నారు. "నా తరువాత డెమోక్రటిక్ అభ్యర్థి విజయం సాధించి, వారసురాలిగా వస్తుందని ఆసక్తిగా ఉన్నా. కాబట్టి, నేను చేయగలిగినదంతా చేస్తాను. ఎన్నికల్లో ఆమె (హిల్లరీ) పోటీలో నిలిస్తే, ఓ బలమైన అభ్యర్థిగా... అమెరికాకు గొప్ప అధ్యక్షురాలు అవుతుందని భావిస్తున్నా" అని పేర్కొన్నారు. ఒబామా తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించినప్పుడు, హిల్లరీ విదేశాంగ శాఖ మంత్రిగా పని చేశారు. రానున్న ఎన్నికల్లో ఆమె అధ్యక్ష పదవికి పోటీ చేస్తారని అందరూ భావిస్తున్నప్పటికీ... ఆమె ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

  • Loading...

More Telugu News