: 45 నిమిషాల పాటు లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన మహారాష్ట్ర మాజీ సీఎం చవాన్


మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ శనివారం విపత్కర పరిస్థితి నుంచి తృటిలో తప్పించుకున్నారు. ముంబైలోని చర్చిగేటు వద్ద ఉన్న తన కార్యాయానికి వెళ్లిన సందర్భంగా ఆయన లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. ఏ ఐదో, పది నిమిషాలో అయితే పర్వాలేదు కాని ఏకంగా 45 నిమిషాల పాటు ఆయన లిఫ్ట్ లోనే చిక్కుబడిపోయారు. చివరకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగితే కాని ఆయన సురక్షితంగా బయటపడలేకపోయారు. మొదటి అంతస్థులోనే ఉన్న తన కార్యాలయానికి వెళ్లేందుకు చవాన్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సంజయ్ దత్ తో కలిసి లిఫ్ట్ ఎక్కారు. చవాన్ ఎక్కిన మరుక్షణమే సాంకేతిక కారణాలతో ఒక్కసారిగా లిఫ్ట్ నిలిచిపోయింది. దీంతో చవాన్ లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. లిఫ్ట్ ను తెరిచేందుకు చవాన్ తో పాటు ఆయన భద్రత సిబ్బంది చేసిన యత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరకు ఈ సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకుని లిఫ్ట్ ను తెరిచారు. దీంతో చవాన్ సురక్షితంగా బయటపడ్డారు.

  • Loading...

More Telugu News