: దేశ భద్రత విషయంలో చిన్న పొరపాటునూ సహించం: రక్షణ శాఖ మంత్రి పారికర్
దేశ రక్షణ విషయంలో చిన్నపాటి పొరపాటును కూడా ఉపేక్షించేది లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో దేశం వైపు కన్నెత్తి చూసేందుకు కూడా పొరుగు దేశాలు సాహసించని రీతిలో భద్రత వ్యవస్థను పటిష్టం చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. భారత నౌకా దళానికి చెందిన ‘సమాచార నిర్వహణ-విశ్లేషణ కేంద్రం (ఐఎంఏసీ)ను ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశ రక్షణ రంగంపై ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ను ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతంగా తీర్చిదిద్దనున్నామని చెప్పిన పారికర్, ఈ విషయంలో పొరుగు దేశాలు ఆందోళన చెందాల్సినంత అవసరం లేదన్నారు.