: రెండో తరం ఆర్థిక సంస్కరణలకు తెర లేవనుంది!
తెలుగు తేజం పీవీ నరసింహారావు హయాంలో దేశంలో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణలను నరేంద్ర మోదీ సర్కారు మరింత ముందుకు తీసుకెళ్లేందుకు శ్రీకారం చుట్టనుంది. ఇందుకు వచ్చే కేంద్ర బడ్జెట్ ను వేదికగా చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆదివారం స్పష్టమైన ప్రకటన చేశారు. రానున్న కేంద్ర బడ్జెట్ లో రెండో తరం ఆర్థిక సంస్కరణలకు తెరలేపనున్నామని ఆయన ఓ ప్రైవేట్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. రెండో తరం ఆర్థిక సంస్కరణలతో దేశాభివృద్ధిని పరుగులు పెట్టించనున్నామని ఆయన ప్రకటించారు. రెండో తరం ఆర్థిక సంస్కరణలతో 2015-16 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ ఆరు శాతం మార్కును దాటుతుందని ఆయన వెల్లడించారు.