: ఏడెనిమిది నెలల్లో ఏపీలో ప్రతిపక్షమే ఉండదు: మాణిక్యాలరావు జోస్యం


ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఏడెనిమిది నెలల్లో ప్రతిపక్షమే లేకుండా పోతుందని రాష్ట్ర మంత్రి, బీజేపీ నేత మాణిక్యాలరావు జోస్యం చెప్పారు. ఇప్పటికే ఏపీలో కాంగ్రెస్ పార్టీ చావుబతుకుల్లో ఉందని, వైకాపాని పూర్తి స్థాయిలో నిరాశానిస్పృహలు ఆవహించాయని తెలిపారు. తమ అధినేత జగన్ ఏ క్షణంలో అయినా మళ్లీ జైలుకు వెళతారనే భావనలో వైకాపా నేతలు ఉన్నారని... వారంతా రానున్న రోజుల్లో టీడీపీలో కాని, బీజేపీలో కాని చేరుతారని చెప్పారు. దీంతో, వైకాపా ఖాళీ అవుతుందని అన్నారు. గోదావరి పుష్కరాలకు ప్రధాని మోదీ వస్తారని తెలిపారు.

  • Loading...

More Telugu News