: తెలంగాణ నూతన పారిశ్రామిక విధానానికి కేబినెట్ ఆమోదం


తెలంగాణ నూతన పారిశ్రామిక విధానానికి ఆదివారం మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది. ఈ విధానం అమలులోకి వస్తే, రాష్ట్రంలో ఇకపై 15 రోజుల్లోనే కొత్త పరిశ్రమలకు సంబంధించి అన్ని రకాల అనుమతులు రానున్నాయి. అంతేకాక ఈ కొత్త విధానానికి కాల పరిమితిని ప్రకటించలేదు. శాశ్వత విధానంగా ప్రభుత్వం ఈ ముసాయిదాను పేర్కొంది. అంతేకాక సవరణలు కూడా అవసరం లేని విధంగా ముసాయిదాను రూపొందించింది. మహిళలు, ఎస్సీలు, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు భారీ రాయితీలను ప్రకటించింది. కొత్త విధానంలో భాగంగా పరిశ్రమలను స్థాపించాలనుకునే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ అనుమతుల కోసం ఏమాత్రం నిరీక్షించకుండా... సొంత ధ్రువీకరణతో తొలుత పరిశ్రమను ఏర్పాటు చేసి, ఆ తర్వాత ప్రభుత్వ అనుమతులను పొందే వెసులుబాటు లభించనుంది.

  • Loading...

More Telugu News