: 'మేడమ్ టుస్సాడ్స్' తరహాలో మనదేశంలోనూ వ్యాక్స్ మ్యూజియం
ప్రపంచ ప్రముఖుల మైనపు విగ్రహాలను రూపొందించి వాటిని ప్రదర్శించే 'మేడమ్ టుస్సాడ్స్' మ్యూజియం ఎంతో ఖ్యాతి సంపాదించింది. ఇప్పుడదే తరహాలో మనదేశంలోనూ ఓ వ్యాక్స్ మ్యూజియంను ఏర్పాటు చేశారు. కోల్ కతా నగరంలో మదర్స్ వ్యాక్స్ మ్యూజియం పేరిట దీన్ని ప్రారంభించారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. దీంట్లో 19 మంది సెలబ్రిటీల మైనపు ప్రతిమలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర హౌసింగ్ డిపార్ట్ మెంట్ ఈ మ్యూజియంను ప్రమోట్ చేస్తోంది. రాష్ట్రానికి చెందిన రాజకీయ, మత, విద్య, క్రీడలు, సంగీతం, వినోదం తదితర రంగాలకు చెందిన ప్రముఖుల విగ్రహాలు ఈ వ్యాక్స్ మ్యూజియంలో కొలువుదీరాయి.