: జగన్ జైలుకు వెళ్లడం ఖాయం: ఏపీ హోంమంత్రి
వైకాపా అధినేత జగన్ పై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి చినరాజప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ భారీ స్థాయిలో అవినీతికి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రతి కేసులోనూ జగనే ప్రథమ ముద్దాయిగా ఉన్నారని... ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అక్రమాలు బయటపడుతున్నాయని అన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపామని... ప్రభుత్వ చర్యలతో అక్రమ రవాణాను చాలామేరకు తగ్గించగలిగామని తెలిపారు. పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయి జయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ, చినరాజప్ప ఈ వ్యాఖ్యలు చేశారు.