: మోదీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణే... టీఆర్ఎస్ కు రోజులు దగ్గరపడ్డాయ్: నాగం


శంషాబాద్ ఎయిర్ పోర్ట్ డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై టీఆర్ఎస్ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు పట్టెడన్నం పెట్టిన మహోన్నతమైన నేత ఎన్టీఆర్ అని... ఈ విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలుసని కొనియాడారు. ప్రస్తుతం టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్న ఎంతో మందికి రాజకీయ జీవితం ప్రసాదించింది ఎన్టీఆరే అని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టింది కూడా ఆ మహనీయుడే అని నాగం అన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని నలుదిశలా చాటిన ఎన్టీఆర్ ను ఒక్క ప్రాంతానికే పరిమితం చేస్తారా? అని నిలదీశారు. దేశవ్యాప్తంగా మోదీ పవనాలు వీస్తున్నాయని... వరుసగా ఒక్కో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తున్న మోదీ తదుపరి లక్ష్యం తెలంగాణ అని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ కు రోజులు దగ్గర పడ్డాయని చెప్పారు.

  • Loading...

More Telugu News