: రామకుప్పం మండలంలో ఏనుగుల బీభత్సం
చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తోంది. పొలాలపై పడి పంటను నాశనం చేస్తున్నాయి. సింగసముద్రం, పొడుచేను, విప్పమానుచేను, బల్లా, ఏగుట్ట గ్రామాల్లో టమోటా, జొన్న, మామిడి, అరటి తోటలను ఏనుగులు తీవ్రంగా నష్టపరిచాయి. ఏనుగుల గుంపుతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఏనుగుల గుంపును వెంటనే అడవిలోకి తరలించాలని స్థానికులు అటవీశాఖ అధికారులకు విన్నవించారు.