: పశ్చిమగోదావరి జిల్లాలో 16 మంది బంగ్లా దేశీయుల అరెస్టు
పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో 16 మంది బంగ్లా దేశీయులను పోలీసులు అరెస్టు చేశారు. బంగ్లాదేశ్ నుంచి ఏజెంట్ ద్వారా వచ్చిన ఈ 16 మందికి పాస్ పోర్టులు లేకపోవడం విశేషం. అక్రమ చొరబాటు, చట్టబద్ధత, పాస్ పోర్టులు లేకుండా నివాసం వంటి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దేశానికి ఉగ్రదాడులు, ఐఎస్ఐఎస్, ఇతర ఉగ్రవాద సంస్థల హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు.