: ముఖ్యమంత్రికి 10 లక్షల విరాళం అందజేసిన సమంతా
విశాఖపట్టణాన్ని అతలాకుతలం చేసిన 'హుదూద్' తుపాను బాధితులకు సహాయం చేసేందుకు సినీ ప్రముఖులు చాలామంది ముందుకొచ్చారు. తుపాను ధాటికి తీవ్రంగా నష్టపోయిన విశాఖకు సినీ నటి సమంత 10 లక్షల రూపాయలు విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసిన సమంత 10 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. వితరణ, సేవా కార్యక్రమాల్లో సమంత ఇతర సినీ నటులకు ఆదర్శంగా ఉన్న విషయం తెలిసిందే.