: మోదీ, నేను జీవితాంతం ఆర్ఎస్ఎస్ సేవకులుగానే ఉంటాం: రాజ్ నాథ్ సింగ్
బీజేపీకి ఆధ్యాత్మిక, సైద్ధాంతిక మార్గదర్శిగా వెనకుండి నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్ ను ఓ 'బాహ్య శక్తి'గా చూడటాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తిరస్కరించారు. ఢిల్లీలో ఆంగ్ల పత్రిక హిందుస్థాన్ టైమ్స్ నిర్వహించిన నాయకత్వ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ మధ్య ఉన్న సంబంధాన్ని ప్రశ్నించగా ఆయన సమాధానమిస్తూ, "ఆర్ఎస్ఎస్ కేవలం బాహ్య శక్తే కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, నేను అక్కడి నుంచే వచ్చాం. అలాంటప్పుడు ఇక దాని ప్రభావం ఉందన్న ప్రశ్నే తలెత్తదు. పీఎం, నేను జీవితాంతం ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులుగానే మిగిలిపోతాం" అని పేర్కొన్నారు.