: స్మితా సబర్వాల్ తెలంగాణ సచివాలయాన్ని వీడనున్నారా?


మెదక్ జిల్లా కలెక్టర్ గా అత్యుత్తమ పనితీరు కనబరచి సీఎం కార్యాలయానికి అదనపు కార్యదర్శిగా నియమితులైన ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ తెలంగాణ సచివాలయాన్ని వీడనున్నారని సమాచారం. సీఎం కేసీఆర్ ఆమె పనితీరుకు ముచ్చటపడి సీఎం పేషీకి పిలిపించుకున్నారు. నల్గొండ జిల్లా నుంచి విజ్ఞప్తులు రోజురోజుకీ పెరిగిపోతుండడంతో ఆమెను ఆ జిల్లాకు కలెక్టర్ గా నియమించే విషయాన్ని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమెపై పని ఒత్తిడి పెరిగిపోతోందని గతంలో మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత సీఎం పేషీలో కీలకమైన నీటిపారుదల శాఖ, పంచాయతీ రాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల భాధ్యతలు నిర్వర్తిస్తూ మహిళా రక్షణ బిల్లును రూపొందించే కమిటీలో ఆమె విధులు నిర్వర్తించారు.

  • Loading...

More Telugu News