: ఏపీ కొత్త రాజధానిలో తెలంగాణ యోధుల విగ్రహాలు: చంద్రబాబు
నవ్యాంధ్రప్రదేశ్ కొత్త రాజధానిలో తెలంగాణ పోరాట యోధుల విగ్రహాలను ఏర్పాటు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుతో పాటు కొమురం భీం, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య విగ్రహాలను కొత్త రాజధానిలో ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. మోత్కుపల్లి నర్సింహులు దీక్షకు సంఘీభావం తెలిపిన సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు, అసలు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు అంకురార్పణ చేసిందే టీడీపీ అన్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెడతామని 2009 ఎన్నికలకు ముందే చెప్పామని, నాడు తమతో పొత్తు పెట్టుకున్న టీఆర్ఎస్ ఎందుకు విభేదించలేదని ఆయన ప్రశ్నించారు. తెలుగు జాతి గర్వించదగ్గ నేతలు ఎన్టీఆర్, పీవీ నరసింహారావులకు భారతరత్న పురస్కారాలను ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామన్నారు. పీవీ జ్ఞాపకార్థం ఢిల్లీలో పీవీ ఘాట్ ను ఏర్పాటు చేయాలని కోరతామని ఆయన చెప్పారు.