: ఓబులేష్ కు డిసెంబర్ 5 వరకు రిమాండ్


కేబీఆర్ కాల్పుల ఘటన నిందితుడు ఓబులేష్ కు నాంపల్లి కోర్టు డిసెంబర్ 5 దాకా జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి నిందితుడిని తొలుత ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు అతడికి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. ఇదిలా ఉంటే, ఓబులేష్ ను వారం పాటు తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టును కోరారు. ఈ పిటిషన్ పై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. దీంతో నిందితుడిని పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు.

  • Loading...

More Telugu News