: ఎన్టీఆర్ ఘాట్ వద్ద మోత్కుపల్లి దీక్ష ప్రారంభం


శంషాబాద్ డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు మార్పు వివాదాన్ని నిరసిస్తూ హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద టి.టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు దీక్ష చేపట్టారు. ముందుగా ఎన్టీఆర్ ఘాట్ కు టి.టీడీపీ నేతలు నివాళులర్పించారు. అనంతరం మోత్కుపల్లి దీక్షలో కూర్చున్నారు. ఆయనతో పాటు పలువురు పార్టీ నేతలు కూడా దీక్షలో పాల్గొంటున్నారు. కాసేపట్లో మోత్కుపల్లి దీక్షకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంఘీభావం తెలుపనున్నారు. తెలంగాణ టెర్మినల్ కు ఓ ఆంధ్రా నేత పేరు ఎలా పెడతారంటూ తెలంగాణ ప్రభుత్వం సహా ఆ రాష్ట్ర పార్టీలన్నీ నిన్న(సోమవారం) అసెంబ్లీలో తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు విమానాశ్రయ పేరు యథాతథంగా ఉంచాలని తీర్మానం చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News