: పోలీసులను చూసి పరారైన గుడుంబా బ్యాచ్
అక్రమంగా గుడుంబాను తరలిస్తూ పోలీసులను చూసి కాళ్ళకు పని చెప్పారు కొందరు యువకులు. కరీంనగర్ నగర శివారులోని హుస్నాబాద్ రహదారిపై శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. రహదారిపై పోలీసులు తనిఖీలు చేస్తుండగా నాలుగు బైకులపై అటువైపే వస్తున్న యువకులు కాస్తంత దూరంలో వాటిని వదిలిపెట్టి పరుగు తీసారు. పోలీసులు వెళ్లి చూస్తే సుమారు 250 లీటర్ల గుడుంబా దొరికింది. బైకులను స్వాధీనం చేసుకుని వాటి నెంబర్ల ఆధారంగా పరారైన యువకులను గుర్తించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.