: శారదా చిట్ ఫండ్ కేసులో మరో ఎంపీ అరెస్ట్


పశ్చిమ బెంగాల్ లో వెలుగుచూసిన శారదా చిట్ ఫండ్ కుంభకోణం అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ప్రమేయముందన్న ఆరోపణల నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీ కునాల్ ఘోష్ జైలుపాలు కాగా, తాజాగా ఆ పార్టీకి చెందిన మరో ఎంపీని సీబీఐ శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసింది. దాదాపు ఆరు గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించిన అనంతరం తృణమూల్ రాజ్యసభ సభ్యుడు సృంజయ్ బోస్ ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. నమ్మక ద్రోహం, మోసం, నేరపూరిత కుట్ర తదితర సెక్షన్ల కింద ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. చిట్ ఫండ్ అక్రమాల నుంచి రక్షించేందుకు శారదా గ్రూపు అధినేత సుదీప్త సేన్ నుంచి బోస్ రూ. 60 లక్షలు తీసుకున్నారని ఆరోపణలున్నాయి. వీటికి సంబంధించి ఆధారాలు కూడా లభ్యం కావడంతో బోస్ ను సీబీఐ అరెస్ట్ చేసింది.

  • Loading...

More Telugu News