: నేడు ఎన్టీఆర్ ఘాట్ లో మోత్కుపల్లి దీక్ష
టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును కించపరుస్తూ తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చర్చకు నిరసనగా ఆ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు నేడు దీక్షకు దిగనున్నారు. సచివాలయం సమీపంలోని ఎన్టీఆర్ ఘాట్ లో నేటి ఉదయం 11 గంటలకు దీక్షకు దిగనున్న ఆయన సాయంత్రం 5 గంటల దాకా తన నిరసనను కొనసాగించనున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులోని డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెడుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై శుక్రవారం సభ అట్టుడికిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు పార్టీలు ఎన్టీఆర్ పేరును ఎయిర్ పోర్టు టెర్మినల్ కు పెట్టడాన్ని ఖండించాయి. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని సభ తీర్మానం చేసింది.