: సీబీఐ అదనపు డైరెక్టర్ దత్తాకు 2జీ కేసు దర్యాప్తు బాధ్యతలు
2జీ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐ అదనపు డైరెక్టర్ ఆర్.కే. దత్తా చేపట్టనున్నారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతల నుంచి సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హాను తొలగిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సిన్హా తర్వాత అత్యున్నత హోదా కలిగిన అధికారి 2జీ కేసు దర్యాప్తు బాధ్యతలు చేపట్టాలని కూడా కోర్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో సీబీఐలో సిన్హా తర్వాత అత్యున్నత హోదా కలిగిన అధికారిగా దత్తానే ఉన్నారు.