: టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు 1999లోనే నిర్ణయించారు!: అశోక్ గజపతిరాజు


శంషాబాద్ విమానాశ్రయ దేశీయ టెర్మినల్ కు దివంగత ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని తెలంగాణలో తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ఢిల్లీలో స్పందించారు. విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టింది తాను కాదన్నారు. 1999 నాటి నిర్ణయమని, అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే తీర్మానాలు చేశాయని తెలిపారు. ఈ క్రమంలో అప్పటి కేబినెట్ నిర్ణయాన్నే తమ ప్రభుత్వం అమలు చేసిందని వెల్లడించారు. ఇక ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం చేసిన తీర్మానంపై చర్చిస్తామన్నారు.

  • Loading...

More Telugu News