: బీసీసీఐ అధ్యక్షుడిగా తిరిగి నన్ను నియమించండి: సుప్రీంను కోరిన శ్రీనివాసన్


బీసీసీఐ అధ్యక్షుడిగా తిరిగి తనను నియమించాలంటూ ఎన్.శ్రీనివాసన్ సుప్రీంకోర్టును కోరారు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కు సంబంధించి తానెలాంటి తప్పు చేయలేదని, ఆ విషయంలో తన పాత్రేమి లేదని ముద్గల్ కమిటీ నివేదిక తెలిపిందని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్నారు. ముద్గల్ కమిటీ దర్యాప్తు జరుగుతున్న సమయంలో అధ్యక్ష పదవి నుంచి తాను స్వచ్ఛందంగా వైదొలగానని శ్రీని కోర్టుకు వివరించారు. కాబట్టి, మళ్లీ అధ్యక్ష పదవి చేపట్టేందుకు అనుమతి తెలపాలని సుప్రీంకు విన్నవించుకున్నారు. మరోవైపు శ్రీనివాసన్ కు మద్దతు తెలుపుతూ బీసీసీఐ కూడా ఈ రోజు ఓ అఫిడవిట్ ను కోర్టుకు సమర్పించింది. ఓ ఆటగాడు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు శ్రీనితో పాటు మరో నలుగురు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ముద్గల్ కమిటీ అనడం సరైంది కాదని బీసీసీఐ అభిప్రాయపడింది. ఈ కేసులో తదుపరి విచారణను సుప్రీం ఈ నెల 24కు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News