: శారదా చిట్ ఫండ్ స్కాంలో తృణమూల్ ఎంపీ అరెస్టు


కోట్ల రూపాయల శారదా చిట్ ఫండ్ స్కాంలో పలువురు రాజకీయ నేతలు అరెస్టవుతున్నారు. తాజాగా, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సృంజయ్ బోస్ ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. స్కాంకు సంబంధించి ఈ రోజు కొన్ని గంటల పాటు ఎంపీని విచారించిన సీబీఐ అధికారులు తరువాత అరెస్టు చేశారు. కాగా, ఈ స్కాంలో అరెస్టయిన రెండో ఎంపీ ఆయనే. గతంలో అదే పార్టీకి చెందిన ఎంపీ కునాల్ ఘోష్ (సస్పెండయ్యారు) అరెస్టయి ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఈయనకంటే ముందు తృణమూల్ పార్టీ ఉపాధ్యక్షుడు రజత్ మజుందార్ ను సీబీఐ అరెస్టు చేసింది. ఆ తరువాత పలువురు వ్యక్తులను సీబీఐ అధికారులు విచారించి అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News