: ఆ ఇంజనీరింగ్ విద్యార్థి గజదొంగ


విద్యార్థుల లక్ష్యాలు మారుతున్నాయి! తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపమో, విద్యభ్యాసంలో రాణించలేమన్న భావనో కానీ, జల్సాలకు అలవాటు పడ్డ ఇంజనీరింగ్ విద్యార్థులు చైన్ స్నాచర్లు, పిక్ పాకెటర్లుగా పోలీసులకు పట్టుబడుతూ భవిష్యత్ ను ప్రశ్నార్థకం చేసుకుంటున్నారు. హైదరాబాదులోని కూకట్ పల్లిలో ఇంజనీరింగ్ విద్యనభ్యసిస్తున్న మేళ్ల శ్రీనయ్య సుందరం అనే గజదొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 59 ల్యాప్ టాప్ లు, 472 గ్రాముల బంగారం, 443 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు. అతని నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ సుమారు 29 లక్షల రూపాయలుంటుందని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News