: ఎన్టీఆర్ ను అవమానపరుస్తూ మాట్లాడటాన్ని వ్యతిరేకిస్తున్నా: మోత్కుపల్లి
శంషాబాద్ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్ కు దివంగత ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని తెలంగాణ శాసనసభ వ్యతిరేకించడాన్ని మోత్కుపల్లి నర్సింహులు ఖండించారు. ఎన్టీఆర్ ను అవమానపరుస్తూ శాసనసభలో మాట్లాడటం దురదృష్టకరమన్నారు. ఇందుకు నిరసనగా రేపు ఉదయం 11 గంటల నుంచి 5 గంటల వరకు ఎన్టీఆర్ ఘాట్ వద్ద దీక్ష చేస్తానని చెప్పారు. కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ నే అవమానించడం సిగ్గుచేటని అన్నారు.