: టీడీపీలో గుర్తింపు లేదంటున్న సినీ నటుడు
సినీ నటుడు సుమన్ తిరుమల విచ్చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆయన మాట్లాడుతూ, మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నానని, అయితే, అక్కడ తగినంత గుర్తింపు దక్కడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుపై నమ్మకంతోనే టీడీపీలో చేరానని పేర్కొన్నారు. టీడీపీలో తన సేవలను పెద్దగా ఉపయోగించుకోవడంలేదన్నారు. ఆహ్వానిస్తే బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.