: ఖరారైన బాబు జపాన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి జపాన్ పర్యటన షెడ్యూల్ ను అధికారులు ఖరారు చేశారు. ఈనెల 24వ తేదీ నుంచి 29వ తేది వరకు ఆయన జపాన్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో చంద్రబాబుతో పాటు రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, ఏపీ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావులతో పాటు సీఎం రమేష్, గల్లా జయదేవ్, పరకాల ప్రభాకర్ తదితర నేతలు, పలువురు ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు రాజధాని నిర్మాణం కోసం సలహాలను స్వీకరించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశంగా ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.