: వైవీ సుబ్బారెడ్డి దత్తత గ్రామం దద్దవాడ
వైఎస్సార్సీపీ తరపున ఎన్నికైన ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి 'సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన' కింద కొమరవోలు మండలంలోని దద్దవాడ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. జిల్లా ఉన్నతాధికారులతో కలసి నేడు సుబ్బారెడ్డి దద్దవాడను సందర్శించారు. దేశంలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 11న సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశంలోని పలువురు ప్రజా ప్రతినిధులు, పలు గ్రామాలను దత్తత తీసుకున్నట్టు ప్రకటించారు. తాజాగా సచిన్ టెండుల్కర్ నెల్లూరు సమీపంలోని పీఆర్ కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించి ఆ గ్రామాన్ని సందర్శించారు.