: చెన్నై చేరుకున్న తమిళనాడు జాలర్లు


శ్రీలంక విధించిన ఉరిశిక్ష నుంచి బయటపడి, విడుదలయిన తమిళనాడుకు చెందిన ఐదుగురు జాలర్లు ఎమర్సన్, పి.ఆగస్టస్, ఆర్.విల్సన్, కే.ప్రశాంత్, జె.లాంగ్లెట్ లు చెన్నై చేరుకున్నారు. తిరుచిరాపల్లిలోని ఎయిర్ పోర్టులో వారికి కుటుంబసభ్యులు, తమిళనాడు బీజేపీ నేతలు, కార్యకర్తలు పలువురు స్వాగతం పలికారు. అయితే, జాలర్లు మీడియాతో మాట్లాడేందుకు పోలీసులు అనుమతించలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా లంక అధ్యక్షుడు మహింద రాజపక్సతో ఫోన్ లో మాట్లాడటంతో క్షమాభిక్ష పెట్టి జాలర్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News