: శంషాబాద్ పేరు మార్పుపై సభలో భగ్గుమన్న కాంగ్రెస్


శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెడుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేేసింది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత కూడా తెలంగాణపై సీమాంధ్రుల పెత్తనం తగ్గలేదని సభలో ఆ పార్టీ ఉపనేత జీవన్ రెడ్డి ఆరోపించారు. కేంద్రం నిర్ణయాన్ని తెలంగాణ సభ ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. వెంటనే సభలో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఆయన సభను కోరారు. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News