: మందుకొట్టి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డ 26 మంది
మద్యం సేవించి వాహనాలు నడపడంతోనే ప్రమాదాలు అధికమవుతున్నాయని భావిస్తున్న ఏపీ పోలీసులు జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టి మందుబాబులను బుక్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రఘురామ్ రెడ్డి ఆదేశాల మేరకు ఏలూరు శివార్లలో గురువారం అర్ధరాత్రి నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు. వాహనాలను నడుపుతున్న వారికి బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించారు. 26 మంది డ్రైవర్లు మద్యం సేవించినట్టు గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు.