: చర్చలకు పిలిచేంత వరకు సమ్మె ఆగదు: జూడాలు


తెలంగాణ ప్రభుత్వం తమను చర్చలకు పిలిచేంత వరకు సమ్మె కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. డీఎంఈ (వైద్య విద్య సంచాలకుడు) పుత్తా శ్రీనివాస్ తో జూనియర్ డాక్టర్లు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. జూనియర్ డాక్టర్లతో 48 గంటలల లోపల చర్చలు జరపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో చర్చలు జరిగాయి. చర్చల్లో జూనియర్ డాక్టర్ల డిమాండ్ల పరిష్కార సాధ్యాసాధ్యాలపై సమాలోచన చేశారు. జూనియర్ డాక్టర్ల సమస్యలను సానుభూతితో పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని, తక్షణం విధుల్లో చేరాలని డీఎంఈ జూడాలకు వివరించారు. తాము ప్రభుత్వంతోనే చర్చలు జరుపుతామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేయడంతో చర్చలు విఫలమయ్యాయి.

  • Loading...

More Telugu News