: రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేయండి: రంగారెడ్డి జిల్లా కోర్టు
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేయాలని రంగారెడ్డి జిల్లా కోర్టు పోలీసులను ఆదేశించింది. తెలంగాణ ప్రజలు ఆంధ్రా దేవుడైన తిరుమల బాలాజీని ఎక్కువగా కొలుస్తున్నారంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు ట్వీట్ చేసిన రాంగోపాల్ వర్మపై రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలైంది. దేవుళ్లపై రాంగోపాల్ వర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గోవర్ధన్ రెడ్డి అనే న్యాయవాది రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో వర్మపై కేసు నమోదు చేయాలంటూ ఎల్బీనగర్ పోలీసులను కోర్టు ఆదేశించింది.