: ఈసారి ప్రధాని నవాజ్ షరీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు


జమ్మూ కాశ్మీర్ అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తమ ప్రతిష్ఠ పెంచుకుని పాక్ లో మద్దతు పెంచుకునేందుకు పాక్ నేతలు కుట్రలు చేస్తున్నారు. పాక్ లో ఆదరణ కోల్పోయిన బిలావల్ భుట్టో కూడా ఇదే బాటలో పయనిస్తున్నాడు. పాక్ లోని ప్రతిపక్షాల ఆందోళనలతో మసకబారిన ప్రతిష్ఠను పెంచుకునేందుకు ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాము చిత్తశుద్ధితో చర్చలకు పిలుస్తున్నా భారత్ స్పందించడం లేదని ఆయన పలు విదేశీ వేదికలపై ప్రస్తావించారు. తాజాగా, ఆయన భారత్ తో చర్చలకంటే ముందు కాశ్మీరీ నేతలతో మాట్లాడతానని అన్నారు. గతంలో భారత్, పాక్ విదేశాంగ శాఖ కార్యదర్శుల చర్చలు కూడా అదే కారణంగా రద్దయ్యాయి. మరోసారి పాక్ ప్రధాని అదే విషయం చెప్పారు. కాశ్మీర్ విషయంలో భారత్ తో చర్చలకు సిద్ధమయ్యే ముందు కాశ్మీరీ నేతలతో చర్చించాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. కాశ్మీర్ విషయం చర్చల ద్వారా పరిష్కారమవ్వాలని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News