: ఏపీ, తెలంగాణ విద్యాశాఖ మంత్రుల భేటీ వాయిదా


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల భేటీ వాయిదా పడింది. తెలంగాణ మంత్రి జగదీశ్వర్ రెడ్డికి అత్యవసర పని ఉండటంవల్ల ఈ సమావేశం నిలిచిపోయింది. ఇంటర్మీడియట్ పరీక్షల వివాదం నేపథ్యంలో చర్చించేందుకు ఈ సాయంత్రం సమావేశం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, అవసరమైతే తెలంగాణ షెడ్యూల్ ప్రకారమే ఏపీలోనూ ఇంటర్ పరీక్షలు జరుగుతాయన్నారు. ఓ మెట్టుదిగి పరీక్షల నిర్వహణకు సహకరించుకుంటామని తెలిపారు.

  • Loading...

More Telugu News